ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని ఓ అటవీ మార్గంలో మావోయిస్టు నక్సలైట్లు విధ్వంసానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా అవపల్లి-బాసగూడ మార్గంలోని తిమ్మాపూర్ సమీపంలో గల దుర్గ గుడి వద్ద ఐదు మీటర్ల మేరకు రోడ్డును తవ్వి గండి పెట్టారు.
సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఈ మార్గంలో రాకపోకల పునరుద్దరణకు సహాయ చర్యలు చేపట్టారు. రోడ్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు నక్సల్స్ తవ్విన మార్గాన్ని పునరుద్దరించారు.
గత రాత్రి నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడ్డారని, జాతీయ రహదారిని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని బీజాపూర్ ఎస్పీ మీడియాలో చెప్పారు.
ఫొటో: నక్సలైట్లు తవ్విన రోడ్డును పోలీసులు పునరుద్ధరించిన దృశ్యం (బస్తర్ కీ ఆవాజ్ సౌజన్యంతో…)