నెమలి మన జాతీయ పక్షి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ నెమలి కనిపిస్తే చాలు వెంటాడి, వేటాడి, చంపి మరీ మాంసహారంగా ఆరగిస్తుంటారు కొందరు. అనారోగ్యంతో చనిపోయిన నెమలిని సైతం వదలకుండా తింటుంటారు ఇంకొందరు. నెమలిని చంపడం నేరమని చాలా మంది ఇప్పటికీ గ్రహించడం లేదు. కేసు నమోదైతేగాని వేటగాళ్లకు విషయం బోధపడడం లేదు.
నెమలి జాతీయ పక్షి కాబట్టి, అది చనిపోతే తగిన, గౌరవ మర్యాదలతో దానికి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. ఢిల్లీ పోలీసులు భారత రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తూ చనిపోయిన నెమలిని ఎలా గౌరవించారో దిగువన వీడియోలో చూసేయండి.