ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ అవకతవకల కేసులో జైలులో గల కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఈ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వు జారీ చేసింది. లిక్కర్ పాలసీ అవకతవకల కేసులో ఐదున్నర నెలలుగా తీహాడ్ జైలులో గల కేజ్రీవాల్ విడుదల కానున్నారు.