తెలంగాణా రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ప్రగతి భవన్ లో సమావేశమై ఈ కింది నిర్ణయాలు తీసుకున్నది.
– ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020 ని ఆమోదించింది.
– ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ని ఆమోదించింది.
– తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లును ఆమోదించింది.
– పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ – గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు – 2018 సవరణ బిల్లును ఆమోదించింది.
– తెలంగాణ జి.ఎస్.టి. యాక్టు -2017 లో సవరణ బిల్లును ఆమోదించింది
– తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020ని ఆమోదించింది
– ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020 ను కేబినెట్ ఆమోదించింది
– ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2002ని ఆమోదించింది.
– ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్ ను ఆమోదించింది.
– టీఎస్ బి పాస్ బిల్ ను ఆమోదించింది.
– తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు -1956 సవరణ బిల్లును ఆమోదించింది.
– ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు -1972 కు సవరణ బిల్లును ఆమోదించింది
– కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులను కేబినెట్ ఆమోదించింది
– కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది.
– 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమిషన్ చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది.
– కేబినెట్ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్సులను అసెంబ్లీలో ప్రవేశ పెడతారు