నమ్మశక్యంగా లేదా? ఔను మన వేప పుల్ల ఖరీదు అమెరికాలో అక్షరాలా 15 డాలర్లు. మన ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం అక్షరాలా 1,104 రూపాయలు. నేటి డాలర్ ఖచ్చిత విలువ ప్రకారం మరో పదిహేను పైసలు కూడా కలుపుకోవచ్చు. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు. ప్రముఖ వ్యాపారవేత్త, సియట్ కంపెనీ చైర్మెన్ హర్షా గోయెంకా ఇందుకు సంబంధించి చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
మనం పెద్దగా పట్టించుకోని వేపపుల్ల ఇప్పుడు అమెరికాలో అత్యంత ప్రియమే కాదు వ్యాపారులకు డాలర్ల పంట పండిస్తోంది. ఉదయాన్నే అక్కడి వారు వేపపుల్లతో పళ్లు తోముకోవడానికి వెచ్చించే డబ్బు విలువ రూ.1,104 అన్నమాట. ‘మీ పేస్టులో ఉప్పుందా? లవంగముందా? యాలకులున్నాయా? బొగ్గుందా? మన్నుందా? మశానముందా? అంటూ ఊదరగొట్టే కార్పొరేట్ కంపెనీల టూత్ పేస్టులకు మనం అలవాటుపడిన తీరుపై నెటిజన్లు ఈ సందర్భంగా తెగ కామెంట్లు చేస్తున్నారు. ఆర్గానిక్ టూత్ పేస్ట్ పేరుతో అమెరికాలో వేపపుల్లలను విక్రయిస్తున్నారుట. హర్ష గోయెంకా చేసిన ట్వీట్ ను దిగువన చూసేయండి మరి.