కరోనా మహమ్మారి వల్ల మరణించినవారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కోవిడ్ వైరస్ సోకి మరణించిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి రూ. 4.00 లక్షల చొప్పున చెల్లించలేమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే. ఇలా చెల్లించాల్సి వస్తే విపత్తు నివారణ కింద కేటాయించిన సహాయ నిధులను మొత్తం కరోనా బాధిత మృతుల కుటుంబాలకే చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది.

కరోనా వల్ల మరణించిన కుటుంబాలకు విపత్తు సహాయం కింద పరిహారం చెల్లించాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నష్టం పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు బుధవారం తీర్పునివ్వడం విశేషం. అయితే బాధిత కుటుంబాలకు ఎంత మొత్తం చెల్లించాలనే అంశంపై నిర్ణయాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వానికే వదిలేస్తూ, ఇందుకు మార్గదర్శకాలను రూపొందించేందుకు సుప్రీంకోర్టు ఆరు వారాల గడువును విధించింది.

Comments are closed.

Exit mobile version