ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్లు చోరీకి గురయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తి వీటిని దొంగిలించినట్లు అధికారులు గుర్తించారు. బెమెతారా జిల్లాలోని నవఘర్ లో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోకి ప్రవేశించి 90 డోసుల వ్యాక్సిన్లను ఎత్తుకువెళ్లినట్లు కనుగొన్నారు. ఈ ఘటన అధికార వర్గాల్లో తీవ్ర కలకలానికి దారి తీసింది. ఇక్కడి కమ్యూనిటీ సెంటర్ లో వృద్ధులకు, రెండో దశ టీకాలను ఇస్తున్నారు. వైద్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వ్యాక్సిన్లు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.