వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజారోగ్యశాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. కొందరు హెల్త్ కేర్ వర్కర్స్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రాలేదని, వ్యాక్సిన్‌ తీసుకోని హెల్త్ కేర్ వర్కర్స్‌కు అవగాహన కల్పిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో త్వరలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెస్తామన్నారు. మున్ముందు ప్రతి కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని, 104కు ఫోన్‌ చేసి టీకా‌పై సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు.

Comments are closed.

Exit mobile version