ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు పార్లమెంట్ సభ్యులు కరోనా బారిన పడ్డారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలోనే ఇద్దరు ఎంపీలకు కరోనా పాజిటివ్ గా వైద్య పరీక్షల్లో తేలింది. అరకు ఎంపీ మాధవి జ్వరంతో బాధపడుతుండగా ఆమెకు అధికారులు టెస్టులు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు వెల్లడైంది. అదేవిధంగా చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు కూడా కరోనా సోకినట్లు తేలింది. అరకు ఎంపీ మాధవి చికిత్స తీసుకుంటుండగా, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఐసొలేషన్ కు వెళ్లారు. దీంతో ఈ ఇద్దరు ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. కాకినాడ ఎంపీ వంగా గీతకు కూడా కరోనా సోకినట్లు శనివారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. ఆమె కూడా ప్రస్తుతం హోం ఐసొలేషన్ లో ఉన్నారు.