అ క్కడెక్కడో పుట్టింది
ఆ పదలో పడేసింది
ఇ టలీకి వెళ్ళింది
ఈ జిప్టుకు పాకింది
ఉ ధృతంగా పెరిగింది
ఊ చకోత కోస్తోంది
ఋ క్కులకే లొంగనంది
ఎ ప్పుడు వస్తానో చెప్పనంది
ఏ డిపించుకుతింటోంది
ఐ శ్వర్యానికి లొంగనంది
ఒ క్కోదేశానికి అంటుతోంది
ఓ డలు విమానాలను ఆపేయించింది
ఔ షధాలే లేవంది
అం దరికీ వ్యాపిస్తోంది
అః కఃనః అన్నట్లుంది (అర్థం కానట్టు ఉంది)
క రోనా తన పేరంది
ఖ నిత్రం లా దిగుతోంది (ఖనిత్రం అంటే గునపం, పలుగు)
గ రిష్ఠంగా పెరుగుతోంది
ఘ నుడు సామాన్యుడని చూడనంది
జ్ఞ వలే తెలియనంది
చ టుక్కున అంటుకుంటుంది
ఛ రఖాలా తిరుగుతోంది
జ బ్బుల్లో పెద్దదయింది
ఝం డా ఎగరేస్తోంది
ఞ! ఆ! యా! అని వెక్కిరిస్తోంది
ట క్కుడెక్కులు చూపిస్తోంది
ఠ క్కున అంటుకుంటుంది
డ బ్బులకు లొంగనంది
ఢ మరుకం మోగిస్తోంది
ణ లా బుద్ది వంకరది
త నకు ఎదురు లేదంటోంది
ద య్యంలా పీడిస్తోంది
ధ ర్మం న్యాయం తనకు లేవంది
న లుగురు కలిస్తే ఓర్వలేక పోతోంది
ప రుగులు పెట్టిస్తోంది
ఫ లితం లేదంటోంది
బ డులు గుడులు మూయించింది
భ యాన్ని ఇంకా పెంచుతోంది
మ రణమృదంగం మోగిస్తోంది
య ముని దగ్గరకు పంపిస్తోంది
ర క్కసి లా తినేస్తోంది
ల క్షలమందిని కబలిస్తోంది
వ రదలా ముంచేస్తోంది
శ నిలా దాపురించింది
ష ట్కాలాల్లో కూడా తానుంటానంది
స బ్బునురగంటే భయమంటుంది
హ రించుటే తన గుణమంది
ళ ఇలా అంటూ అంటుకుంటోంది (‘ళ’ ను అల అని చదువుతుంటారు)
క్ష మించడం తన డిక్షనరీ లో లేదంది
ఱ ౦పము లా కోసేస్తోంది
‘ఇంట్లో ఉండండి – సురక్షితంగా ఉండండి’
✍️ మాడుగుల నారాయణమూర్తి