తెలంగాణాలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిలకు కరోనా పాజిటివ్ గా వైద్య పరీక్షల్లో తేలింది. సింగరేణి వనమహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే చందర్ కు కరోనా లక్షణాలు వెలుగు చూశాయి, దీంతో టెస్టుల్లో పాజిటివ్ రావడంతో ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
అదేవిధంగా పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి, ఆయన తల్లికి, తమ్ముడికి, కారు డ్రైవర్ కు, పీఏకు కూడా కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. హైదరాబాద్ లోని ప్రయివేట్ ఆసుపత్రిలో ఎమ్మెల్యేతోపాటు మిగతా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణాలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలకు చెందిన మరికొందరు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.