దేశంలో తొలిసారిగా జంతువులకూ కరోనా నిర్ధారణ జరిగింది. హైదరాబాద్ జూ పార్కులోని ఎనిమిది సింహాలకు కరోనా వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. సింహాలకు సార్స్ కోవ్-2 వైరస్ సోకినట్లు సీసీఎంబీ నివేదికలో వెల్లడైంది. సింహాలకు కరోనా లక్షణాలు కనిపించడంతో నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపారు. ప్రస్తుతం సింహాలు ఆరోగ్యంగానే ఉన్నాయని జూ అధికారులు ప్రకటించారు. కాగా ఈనెల 2వ తేదీ నుంచే జూ పార్కును మూసేశారు.