ఔను.. ఒకే కుటుంబంలో పన్నెండు మందికి కరోనా వైరస్ సోకింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజులుగా గొంతునొప్పి, జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి కుటుంబంలోని వారందరికీ జ్వరాలు వచ్చాయి. దీంతో అనుమానంతో కుటుంబంలోని 14 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ సుజాత మీడియాకు చెప్పారు. ఈ ఘటనతో ఆయా కుటుంబం నివసించే ప్రాంతవాసులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.