ఓ గదిలో బెడ్ పై రెండు, పక్కనే గల కుర్చీలోని తెల్లటి కవర్లో మరొకటి… ఇవేమిటో తెలుసా? కరోనా బారిన పడి మరణించినవారి డెడ్ బాడీలు. ఈ ఫొటోలకు ఎక్కువగా అక్షర కథనం అక్కర లేదు. సీఎన్ఎన్ న్యూస్ ఛానల్ విడుదల చేసిన ఈ ఫొటోలు ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి. అమెరికా డెట్రాయిట్ లోని సినాయ్ గ్రేస్ ఆసుపత్రిలో తీసిన చిత్రాలుగా సీఎన్ఎన్ పేర్కొంది.
మార్చురీ డెడ్ బాడీస్ తో నిండిపోయిన కారణంగా ఎక్కడా ఖాళీ లేక ఇలా బెడ్ రూముల్లోనూ శవాలను భద్రపరుస్తున్నారట. మరో ఫొటోలో గల శవాలను కూడా నిశితంగా పరిశీలించండి. శవాలను భద్రపరిచే ఫ్రిజ్ లు నిండిపోవడంతో ఆసుపత్రి ఫ్లోర్ లోనే ఇలా ప్లాస్టిక్ కవర్లలో చుట్టి ఉంచారు. డెట్రాయిట్ సిటీలోని ఆయా ఆసుపత్రిలో ప్రతి 12 గంటలకు ఐదుగురు చొప్పున కరోనాతో మరణిస్తున్నట్లు సీఎన్ఎన్ నివేదించింది. కరోనా తీవ్రత అధికంగా గల అమెరికాలోని పలు నగరాల్లో డెట్రాయిట్ కూడా ఒకటని సీఎన్ఎన్ తన వార్తా కథనంలో నివేదించింది.
మన దేశంలో లాక్ డౌన్ ఉల్లంఘనకు పాల్పడేవారికి ఈ ఫొటోలు ఓ హెచ్చరిక లాంటివి. ఇది భయపెట్టడం కాదు. కరోనా మహమ్మారి విషయంలో అప్రమత్తతను గుర్తు చేయడం. అందుకే ఇల్లు కదలకండి. లాక్ డౌన్ నిబంధనలను పాటించండి.
Photo courtesy: CNN