రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ఖమ్మం నగరంలో పర్యటించిన సందర్భంగా మంత్రి అజయ్ కుమార్ పై చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిలించిన సంగతి తెలిసిందే. సంజయ్ ఆరోపణలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా గట్టిగానే తిప్పికొట్టారనేది వేరే విషయం. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమేనని, దమ్ముంటే తనపై విచారణ జరపాలని కూడా మంత్రి పువ్వాడ సవాల్ విసిరారు. ఇదిగో ఈ నేపథ్యంలో ‘మినిస్టర్ పువ్వాడ ఇన్ఫో-112’ పేరున గల వాట్సాప్ గ్రూపులో నిన్న రాత్రి పొద్దుపోయాక సాక్షాత్కరించిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి తీవ్ర చర్చకు దారి తీసింది. ఫార్వర్డెడ్ పోస్టుగా మంత్రి వ్యక్తిగత అనుయాయులు ఈ పోస్టును గ్రూపులో షేర్ చేయడం గమనార్హం. ఆ పోస్ట్ ఏమిటో దిగువన ఉన్నది ఉన్నట్లుగానే చదవవచ్చు.
క”మలం” యోధులకు సామాన్యజనం వాణి అంకితం ??
విమర్శలు చేయడం మానండ్ర తొండిబ్యాచ్ ఫెలోస్..
నలుగురు చిచోరగాళ్లతో కలిసి గొంతుచించుకుంటే మీ చొక్కాలు చిరగటం తప్పా ఫలితం లేదనే విషయాన్ని గ్రహించడ్రా బత్తాయిలు???
నాయకుడంటే ఓ కులానికి , మతానికి ఉండడ్రా యాధృచిక యాచకుల్లారా..?
నాయకుడంటే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ యావత్తు దేశాన్ని.. యావత్తు ప్రజానికాన్ని స్వాగతిస్తాడనే విషయాన్ని మరువకండ్రా పుండకోరుగాళ్లరా.
నాయకుడంటే అజయన్న లా ఉండాలి..!!
అభివృద్ధి కోరే నాయకుడుంటే అన్ని వర్గాల జీవనం నిత్యం జయకేతనమే..!!
జై తెలంగాణ ✊✊