తెలంగాణా రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అటవీ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల సమస్యను ఆమె ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ములుగు నియోజకవర్గంలోని గంగారం మండల కేంద్రంలో శనివారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోడు భూములకు సంబంధించి స్వయంగా సీఎం స్పందించినా, కొంత మంది అధికారులు కావాలని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అటువంటి అధికారుల ఆటలు సాగనీయకుండా, అవసరమైతే ఇక్కడి నుంచి పంపించి, మీ జోలికెవరూ రాకుండా కాపాడే బాధ్యత తమదిగా మంత్రి సత్యవతి వ్యాఖ్యానించారు. మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను దిగువన చూడవచ్చు.