‘హమాలీ పని చేసుకునే వెసులుబాటు ఇవాళ తెలంగాణల గ్రామ గ్రామానికి వచ్చింది. ఇంతకు మించిన ఉపాధి ఏముంటదని నేను అడుగుతున్న. ఉపాధి అంటే ఇది గాదా అంటున్న. ఉపాధి ఇదీ… ఎంప్లాయిమెంట్ అంటే గిదీ..!’ ఏమిటీ సరికొత్త నిర్వచనం అనుకుంటున్నారా? ఇది హమాలీ పనికి భాష్యం కానేకాదు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలుగా పేర్కొంటున్న వీడియో కలకలం సృష్టిస్తోంది. ఉపాధికి, హమాలీ పనికి లంకె పెడుతూ మంత్రి నిరంజన్ రెడ్డి చేసినట్లు పేర్కొంటున్న వీడియోలోని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి చేసినట్లు పేర్కొంటున్న ఆయా వ్యాఖ్యల వీడియో దిగువన ఉంది. హమాలీ పని, ఉపాధికి సంబంధించి ఇంకా ఆయన ఏమన్నారో వివరంగా వీక్షింంచండి.