తెలంగాణా పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా పాదయాత్రను ప్రారంభించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి రేవంత్ హైదరాబాద్ కు పాదయాత్రగా బయలుదేరడం కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి అచ్చంపేటలో రేవంత్ రెడ్డి తొలుత రాజీవ్ రైతు భరోసా యాత్ర దీక్షను చేపట్టారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత మల్లు రవి, ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాదయాత్ర చేయాల్సిందిగా రేవంత్ ను కోరారు. దీంతో రాజీవ్ రైతు భరోసా దీక్షను పాదయాత్రగా మారుస్తూ రేవంత్ నిర్ణయం తీసుకోవడం విశేషం.