ఎమ్మెస్సార్ గా ప్రాచుర్యం పొందిన కాంగ్రెస్ సీనియర్ నేత మేన్నేని సత్యనారాయణ రావు (87) ఇక లేరు. కరోనా బారిన పడి ఆయన ఈ ఉదయం కన్ను మూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఎమ్మెస్సార్ ను ఆయన కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెస్సార్ ఈ తెల్లవారు జామున 3.45 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రత్యేకతను ఆపాదించుకున్న ఎమ్మెస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఆర్టీసీ చైర్మెన్ గానూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా వెదిరెకు చెందిన సత్యనారాయణరావు ఇందిరాగాంధీ హయాం నుంచీ అదే పార్టీలో కొనసాగుతున్నారు.