ఇద్దరు తెలంగాణా మంత్రులపై ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలతో కూడిన వీడియోను ట్వీట్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చేతి నుంచి మరో మంత్రి గంగుల కమలాకర్ ఏదో పదార్థం తీసుకుని నోట్లో వేసుకుంటున్న వీడియోను దాసోజు శ్రవణ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఇద్దరు మంత్రుల మధ్య చేతులు మారినట్లు పేర్కొంటున్న తినుపదార్థం నిషేధితమైందిగా శ్రవణ్ ఆరోపిస్తున్నారు. ఇంతకీ మంత్రుల చేతుల మధ్య మారిన ఆయా పదార్థమేమిటో, దాసోజు శ్రవణ్ ఏమంటున్నారో దిగువన గల ట్వీట్ లో చూడవచ్చు.