తెలుగు మీడియాలోని ఓ పత్రిక మేనేజర్ భారీ ఎత్తున డబ్బు ఎగవేశారనే అంశం ఖమ్మం ఛాంబర్ ఆప్ కామర్స్ పరిధిలోకి వెళ్లింది. ప్రస్తుతం ఖమ్మంలోనే పనిచేస్తున్న ఆయా మేనేజర్ వ్యవహార తీరుపై ఇప్పటికే సదరు పత్రిక ఎడిటర్ ను ఉద్ధేశిస్తూ ప్రముఖ వ్యాపారి ఒకరు సోషల్ మీడియా ద్వారా బహిరంగలేఖ కూడా రాశారు. వ్యాపారం పేరుతో రూ. 10 లక్షల మొత్తాన్ని ఆయా పత్రిక మేనేజర్ ఎగవేశాడని ఖమ్మంలోని బాలాజీ స్టోర్స్ కు చెందిన మేళ్లచెరువు వెంకటరమణ అనే వ్యాపారి తన బహిరంగ లేఖలో ఆరోపించారు. ఈ వ్యవహారం పోలీసుల వరకు కూడా వెళ్లింది.
ఈ నేపథ్యంలోనే బాలాజీ స్టోర్స్ యజమానుల్లో మరొకరైన మేళ్లచెరువు ఉమామహేశ్వరరావు ఖమ్మం చాంబర్ ఆప్ కామర్స్ లో తాజాగా ఫిర్యాదు చేశారు. తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా సదరు పత్రిక మేనేజర్ మోసం చేశాడని, తిరిగి తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నాడని పత్రిక మేనేజర్ పై ఉమామహేశ్వరరావు వర్తక సంఘంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమకు ఫిర్యాదు అందినమాట వాస్తవమేనని ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు ts29తో చెప్పారు. ఇరువర్గాలను కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి కృషి చేసే దిశగా ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా మరో వివాదాస్పద పోస్టు కూడా ఇదే దశలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. పత్రిక మేనేజర్ డబ్బు ఎగవేత ఆరోపణల వివాదాంశానికి, ఈ పోస్టుకు సంబంధం ఉందో లేదోగాని, ఈ ఘటన కూడా ఖమ్మం జర్నలిస్టు సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది. ఆయా పోస్టు ఏమిటో దిగువన ఉన్నది ఉన్నట్లుగా చదవండి.
ఇంతకాలం జర్నలిస్టులను, వ్యాపారస్తులను ఇబ్బందులు పెట్టి సంపాదించిందంతా కక్కాల్సిన టైమ్ వచ్చింది నీకు. నా వద్ద 10వేలు తీసుకొని కొందరి చెప్పుడు మాటలు విని వేరే వాళ్లకు 50వేలకు రిపోర్టర్ పోస్టు అమ్ముకున్నపుడే నీ పతనం ప్రారంభమైంది. ఇది జరిగి కరెక్టుగా సంవత్సరం అయింది. సంవత్సరం తిరగకముందే నీకు నా కుటుంభం ఉసురు తగిలింది. నీ వలన కష్టాలు అనుభవించిన విలేకర్ల అందరి ఉసురు నీకు తగిలింది. విధి రాతను ఎవ్వరూ తప్పించకోలేరు. ఇది నీకు ప్రారంభం మాత్తమే మునుముందు అసలు సిసలైన సినిమాను చూస్తావు