ఈనెల 10వ తేదీన తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్జప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పలు అంశాలపై ఆయన సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
ఇందులో భాగంగానే వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్లు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలపై, వరంగల్ హన్మకొండ జంటనగరాల రవాణా, అభివృద్ధికి అవరోధంగా వున్న రైల్వే ట్రాక్ ల మీద రైల్వే వోవర్ బ్రిడ్జి ( ఆర్ వో బి) ల నిర్మాణం, తదితర అభివృద్ధి అంశాలపై స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష జరిపి, సీఎం కేసీఆర్ మంజూరు చేయన్నారు.
అదేవిధంగా వరంగల్ ఇంటర్నల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు చేపట్టవలసిన చర్యలపై, వరంగల్ టెక్స్ టైల్ పార్క్ పనుల పురోగతి అంశాలను సీఎం సమీక్షించనున్నారు. హన్మకొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ అదే రోజు ప్రారంభించనున్నారు