నిరుద్యోగ భృతిపై తెలంగాణా ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుందా? ఈమేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసేసుకున్నారా? ఔనంటున్నారు… రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ త్వరలోనే నిరుద్యోగ భృతిని ప్రకటించవచ్చని ఆయనే స్వయంగా చెప్పారు. తెలంగాణా భవన్ లో రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, ఈ అంశంపై చేసిన ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చని, ఇప్పటికే లక్షా 31 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు కేటీఆర్ వెల్లడించారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.