టీఆర్ఎస్ పార్టీ సన్నాసుల మఠం కాదని, పక్కా రాజకీయ పార్టీ అని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత పాడి కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న సందర్భంగా తెలంగాణా భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం సందర్భంగా తనను తిట్టినన్ని తిట్లు ఎవరినీ తిట్టలేన్నారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని, గెలుస్తామని, ఓడుతామని, అధికారం శాశ్వతం కాదని అన్నారు. రాజకీయ పార్టీలో చేరినవారికి ఏదో ఒక పాత్ర వస్తుంటుందని, రాజకీయ పార్టీ అంటేనే ఓ ‘పవర్’ అని సీఎం అభివర్ణించారు.

దళిత బంధు పథకంపైనా సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం అదృష్టమని, దళిత బంధు పథకాన్ని ఇక్కడే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం అమలుకు హుజూరాబాద్ నియోజవర్గాన్ని పైలెట్ గా ఎంచుకున్నట్లు చెప్పారు. ఎలక్షన్ ఉన్నందునే హుజురాబాద్ లో దళిత బంధు పెట్టామంటున్నారని కేసీఆర్ అన్నారు. ‘ఔను పెడతాం.., నేను స్వార్ధపరుడినైతే గజ్వేల్ లోనే ఈ స్కీంను పెట్టుకునే వాడిని కదా? పథకం పెట్టినప్పుడు లబ్ధి కోరుకోకూడదా? ఏమీ పెట్టని మీరు లబ్ధి కోరుకోవచ్చా? కానీ మేం కోరుకోవద్దా?’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కౌశిక్ కు మంచి భవిష్యత్ ఉందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

Comments are closed.

Exit mobile version