ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు తెలంగాణా సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురి కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. జ్వరంతో సీఎం కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారని, జ్వరం తగ్గితే ప్రధాని పర్యటనలో పాల్గొనే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడా జరుగుతోంది.
కాగా ఇక్రిశాట్ స్వర్ణోత్సవం, రామానుజాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానికి స్వాగతం పలికే బాధ్యతను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు అప్పగించిన సంగతి తెలిసిందే.