తెలంగాణా రాజకీయాల్లో ఇదో సంచలన పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు నాయకులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. వీరిలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్ర, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబులు ఉండడం విశేషం. విపక్ష పార్టీకి చెందిన నాయకులకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ లభించడం సంచలనాత్మకంగా పలువురు అభివర్ణిస్తున్నారు.
ఈమేరకు భట్టి విక్రమార్కతోపాటు ఆయా ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. మరియమ్మ లాకప్ డెత్ అంశంపై వినతి పత్రం ఇవ్వడానికే భట్టితోపాటు ఆయా ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిసినట్లు చెబుతున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టాక విపక్ష పార్టీలకు ప్రగతి భవన్ లో లభించిన తొలి అపాయింట్మెంట్ గా ఈ ఘటనను భావిస్తున్నారు.