పోలీసులపై, అధికారుల వ్యవస్థ పనితీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై, పోలీసులపై దాఖలైన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఇందుకోసం హైకోర్టు సీజేల నేతృత్వంలో స్థాయీ సంఘాలను ఏర్పాటుపై యోచిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతానికి స్థాయీ సంఘం ఏర్పాటుకు ఉత్తర్వులివ్వడం లేదన్నారు.

అధికార పార్టీ అండదండతో చెలరేగే పోలీసులకు న్యాయవ్యవస్థ రక్షణ కల్పించలేదని స్పష్టం చేశారు. వసూళ్లకు పాల్పడే అధికారులు మూల్యం చెల్లించుకోవలసిందేనని అన్నారు. అధికారులు కోర్టులను ఆశ్రయించడం అలవాటుగా మారిందన్నారు. ఛత్తీస్ గఢ్ మాజీ అదనపు డీజీ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిన్ ఎన్వీ రమణ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments are closed.

Exit mobile version