వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం త్వరలోనే తేలనుంది. రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తన పౌరసత్వ వివాదంపై చెన్నమనేని రమేష్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. తాను జర్మనీ పౌరసత్వాన్ని వెనక్కి ఇచ్చేసినట్లు రమేష్ తన కౌంటర్ ద్వారా ప్రకటించారు.
అయితే చెన్నమనేని రమేశ్ కౌంటర్పై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు రెండు వారాలు గడువునిచ్చింది. మరోసారి ఎవరూ గడువు కోరవద్దని, తుది వాదనలకు సిద్ధం కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగానే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదపు కేసు విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.