Facebook X (Twitter) YouTube
    Sunday, September 24
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»పొంగులేటి అనుచరునిపై సీఐడీ కేసు

    పొంగులేటి అనుచరునిపై సీఐడీ కేసు

    June 24, 20231 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 muvva

    కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుని అరెస్టుకు రంగం సిద్ధమైందా? పొంగులేటి కాంగ్రెస్ లో చేరేందుకు భారీ సభ నిర్వహణకు సిద్ధపడుతున్న నేపథ్యంలో ఆయనకు కుడిభుజంగా ప్రాచుర్యంలో గల ఖమ్మం డీసీసీబీ మాజీ చైర్మెన్ మువ్వా విజయ్ బాబును అరెస్ట్ చేసేందుకు సీఐడీ పోలీసులు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ వ్యవహారాలతో సీఐడీ పోలీసులకు ఎటువంటి సంబంధం లేకపోయినా, తాజాగా మువ్వా విజయ్ బాబుపై నమోదైన ఓ ఎఫ్ఐఆర్ తీవ్ర సంచలనాన్ని కలిగిస్తోంది. డీసీసీబీ చైర్మెన్ గా మొవ్వా విజయ్ బాబు వ్యవహరించిన కాలంలో అనేక అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే కొన్ని కేసులు నమోదయ్యాయి. అందుకు సంబంధించిన విచారణలు, కోర్టు స్టే వంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి.

    ts29 dccb2

    అయితే తాజాగా అంటే ఈనెల 19వ తేదీన విజయ్ బాబుపై సీఐడీ పోలీసులు ఓ కేసు నమోదు చేశారు. వి. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయ్ బాబుపై ఐపీసీ 403, 406, 420 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మువ్వా విజయ్ బాబు 2015-18 కాలంలో డీసీసీబీ చైర్మెన్ గా వ్యవహరించినపుడు కొనుగోలు చేసిన ఓ ప్రముఖ కంపెనీకి చెందిన లాకర్లలో అక్రమాలు జరిగాయన్నది ఫిర్యాదు సారాంశం. ఈ ఫిర్యాదుపైనే సీఐడీ పోలీసులు విజయ్ బాబుపై తాజా కేసు నమోదు చేశారు. తాజాగా సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో మొవ్వా విజయ్ బాబు అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతోంది. పొంగులేటి వర్గీయుల్లో ఈ ఘటన తీవ్ర కలకలానికి దారి తీసింది. కాగా బీఆర్ఎస్ పార్టీలో లేకపోవడం వల్లే మువ్వా విజయ్ బాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని డీసీసీబీ డైరెక్టర్, పొంగులేటి మరో ముఖ్య అనుచరుడు తుళ్లూరి బ్రహ్మయ్య అన్నారు.

    CID case khammam dcccb muvva vijay babu muvva vijaybabu case ponguleti srinivasa reddy ts29 Telegu news
    Previous Article‘పొంగులేటి’ వెనుక ఎవరు..!?
    Next Article పొంగులేటి శిబిరంలో మళ్లీ కలకలం

    Related Posts

    రింగ్ రోడ్డు చుట్టూ ‘భూ’చోల్లు

    July 13, 2023

    అధికారులపై ‘పొంగులేటి’ ఘాటు విమర్శలు

    July 1, 2023

    ‘పోస్టర్ బెదిరింపు’లపై ఖమ్మం సీపీ కీలక ప్రకటన

    July 1, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.