పాస్టర్ ముసుగులో కీచక చర్యలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ లోని ఓ చర్చికి పాస్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జోసఫ్ అలియాస్ సాధు అనే మత ప్రభోదకుడిపై పలు ఆరోపణలు వచ్చాయి.

చర్చికి వచ్చే యువతులను లొంగదీసుకుని మోసం చేసేవాడని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడినట్లు అభియోగాల సారాంశం. ఈ నేపథ్యంలోనే ముగ్గురు యువతులను మోసం చేసి పెళ్లి కూడా చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

పాస్టర్ జోసఫ్ అలియాస్ సాధు అరాచకాలపై ఎమ్మార్పీఎస్ నేతల ఆధ్వర్యంలో బాధిత యువతులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమపై లైంగిక దాడికి పాల్పడి, బెదిరింపులకు దిగుతున్నాడని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాస్టర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

Comments are closed.

Exit mobile version