అసలుకన్నా నకిలీ ముందంజలో ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో రుజువైన సత్యం కూడా. కరోనా వ్యాక్సిన్ అంశంలోనూ ఇదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా వ్యాక్సిన్లు ప్రపంచ జనాభాకు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే నకిలీ వ్యాక్సిన్లు మార్కెట్లోకి రావడం కలకలం కలిగిస్తోంది. కరోనా పుట్టినిట్లు చైనాలో ఇప్పుడు నకిలీ వ్యాక్సిన్ల దందా సాగుతోంది. నకిలీ వ్యాక్సిన్లు విక్రయిస్తున్న 80 మందిని చైనా పోలీసులు అరెస్ట్ చేయడం ఇందుకు నిదర్శనం. వీరివద్ద నుంచి దాదాపు మూడు వేల నకిలీ వ్యాక్సిన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.

శాన్ డాంగ్, బీజింగ్, జియాంగ్ ప్రావిన్స్ లలో పోలీసుల దాడుల్లో నకిలీ వ్యాక్సిన్ల దందా వెలుగు చూసింది. గడచిన అయిదు నెలలుగా నకిలీ వ్యాక్సిన్ల వ్యాపారాన్ని దుండగులు యధేచ్ఛగా సాగిస్తున్నట్లు పోలీసుల విచాణలో తేలింది. అయితే ఈ నకిలీ వ్యాక్సిన్ల వ్యాపారం కేవలం చైనాకే పరిమితం కాలేదు. ఆఫ్రికా దేశానికి కూడా వ్యాపారులు వీటిని రవాణా చేశారు. దేశం దాటి ఆఫ్రికాకు వీటిని ఎలా రవాణా చేశారనే అంశంపై చైనా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ విషయంలో ఇతర దేశాల సహకారాన్ని చైనా అర్ధించడం గమనార్హం.

Comments are closed.

Exit mobile version