కరోనా వైరస్ భయం కోళ్ల పరిశ్రమ రంగాన్ని కుదేలు చేసిన సంగతి తెలిసిందే. చికెన్ తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని మంత్రులతోపాటు పౌల్ట్రీ రంగ ప్రముఖులు ఎంతగా నచ్చచెబుతున్నా ప్రజలు మాత్రం చికెన్ వైపు కన్నెత్తి చూడడం లేదు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో నిన్న గాక మొన్ననే ఓ ఫౌల్ట్రీ రైతు రూ. 10 లక్షల విలువైన కోళ్లను భూమిలో పాతి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన కోళ్ల పరిశ్రమ దీనావస్థకు ఆయా ఘటన ఓ మచ్చు తునక మాత్రమే. ఈ నేపథ్యంలోనే ఎంతకీ అమ్ముడుపోని కోళ్లను ఏదో రకంగా విక్రయించేందుకు కోళ్ల పరిశ్రమ రైతులు పడరాని పాట్లు పడుతూనే ఉన్నారు.

కరీంనగర్ సమీపంలోని చింతకుంట బ్రిడ్జి వద్ద ఓ కోళ్ల రవాణా వ్యానును రోడ్డు పక్కన నిలిపి కోళ్లను విక్రయిస్తున్న తీరును దిగువన వీడియోలో తిలకించండి. రూ. వందకు నాలుగు అంటూ కోళ్ల రవాణా వ్యాన్ కు చెందిన యువకుడు రోడ్డుకు అడ్డం పడి మరీ గొంతెత్తి అరుస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదీ ప్రస్తుతం కోళ్ల వ్యాపారం దుస్థితి.

Comments are closed.

Exit mobile version