ఫొటోను తీక్షణంగా చూడండి.. కళ్లు కాస్త పెద్దగా చేసుకుని నిశితంగా పరిశీలించండి. ఓ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కింద సెల్లార్ పార్కింగ్… అంతేగా? అని అప్పుడే తేల్చేయకండి. కాస్త కుడి వైపు చూడండి. రెడ్ కలర్ మార్కింగ్ చేసిన సర్కిల్ లో కనిపిస్తున్నదేమిటి? ఏదో వికృతాకారం కనిపిస్తోంది కదూ? కంగారు పడకండి.. ఇదేమీ గ్రహాంతర జీవి కాదు.. కానీ దెయ్యమట.
ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ సమీపంలోని లాల్ పూర్ లో గల ఓ ప్రయివేట్ ఆసుపత్రి భవనం దిగువన గల సెల్లార్ ఇది. వెహికిల్ పార్కింగ్ కోసం దీన్ని వినియోగిస్తున్నారు. అయితే ఈ పార్కింగ్ ప్లేస్ లో దెయ్యాలు తిరుగుతున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయని ఛత్తీస్ గఢ్ మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి. పార్కింగ్ స్థలంలో దెయ్యం స్వయంగా వెడుతున్నట్లు కనిపించిందని, ఆ సమయంలో అక్కడ ఉన్నవారు తమ మొబైల్ ద్వారా దీన్ని చిత్రీకరించారన్నది ఆయా వార్తల సారాంశం. ఈ సందర్భంగా ఓ నిచ్చెన ఎటువంటి మానవ శక్తిని ప్రయోగించకుండానే కదులుతున్న దృశ్యానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదే సమయంలో మరికొందరు దెయ్యాలను ఫొటోలు కూడా తీశారట. ప్రస్తుతం రాయ్ పూర్ లోని ఆసుపత్రి సెల్లార్ లో దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనకు కారణమైంది. ఈ ఘటనను ts29.in మాత్రం ధృవీకరించడం లేదు.