కరోనా తీవ్రతపై కేంద్ర ఆరోగ్యశాఖ ప్రజలను హెచ్చరించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, దీని తీవ్రత కూడా ఏరోజుకారోజు పెరుగుతోందని పేర్కొంది. కరోనా వైరస్ విషయంలో ప్రజల నిర్లక్ష్యమే వైరస్ విజృంభణకు కారణంగా వెల్లడించింది. అయితే ఇప్పటికీ కరోనా వ్యాప్తిని నిలువరించే అవకాశం ప్రజల చేతుల్లో ఉందని, కోవిడ్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించడమే ఇందుకు దోహపడుతుందని నిర్దేశించింది. దేశంలోని కరోనా స్థితిని కేంద్ర ఆరోగ్యశాఖ మీడియాకు వివరిస్తూ అన్ని రాష్ట్రాలు ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాల్సిన అవసరమందని ఆ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ను నిలువరించడంలో ప్రజల భాగస్వామ్యం ప్రధానమని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వచ్చే నాలుగు వారాల కాలం అత్యంత కీలకమని కూడా పేర్కొనడం గమనార్హం.