తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణా రాష్ట్రాల్లో మరో పదేళ్ల వరకు పునర్విభజన లేనట్లేనని స్పష్టతనిచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2031 సంవత్సరం తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నత్యానంద రాయ్ వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ, తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వకంగా ఆయా సమాధానం ఇచ్చారు. మరో అయిదేళ్ల తర్వాత… 2026 జనాభా లెక్కల ఆధారంగా రాజ్యాంగంలోని 170 అధికరణం ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని, వచ్చే ఎన్నికల్లోపే పునర్విభజన జరుగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. నియోజకవర్గాల పునర్విభజనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు కేంద్ర స్పష్టీకరణతో డీలా పడినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు.

Comments are closed.

Exit mobile version