జగిత్యాలలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం సందడి నెలకొంది. తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా జీవన్ రెడ్డి నియామకం ఖరారైందనే వార్తలకు, మంగళవారం ఆయన పుట్టినరోజు కూడా కావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఆయన నివాసం సందడిగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జగిత్యాలలోని ఆయన ఇంటికి చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ముందుగా జీవన్ రెడ్డి ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. పొన్నం ప్రభాకర్తో పాటు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని సందడి చేస్తున్నారు. ఆయన పుట్టిన రోజు కూడా కలిసిరావడంతో కేక్ కట్ చేసి శాలువాలు, పూలదండలతో జీవన్ రెడ్డిని సత్కరించి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.
అయితే పీసీసీ అధ్యక్ష పదవికి తన పేరు ఖరారైనట్లు తనకు ఎటువంటి సమాచారం లేదని జీవన్ రెడ్డి చెబుతుండడం ఆసక్తికరం. జీవన్ రెడ్డి ఇంటి ముందు నెలకొన్న సందడి దృశ్యాలను దిగువన చూడవచ్చు.