దేశవ్యాప్తంగా సీబీఐ భారీ ఎత్తున దాడులు నిర్వహిస్తోంది. దేశంలోని 14 రాష్ట్రాల్లో 76 చోట్ల సీబీఐ పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. చైల్డ్ పోర్న్ ఆన్ లైన్ ముఠా కార్యకలాపాల రాకెట్ పై సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తుండడం గమనార్హం.
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఒడిషా, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి.
ఆన్ లైన్ చైల్డ్ పోర్న్ రాకెట్ కు సంబంధించి గతంలో నమోదు చేసిన 23 కేసుల్లో 83 మంది నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ తాజా దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆన్ లైన్ ద్వారా పెద్ద మొత్తంలో చైల్డ్ పోర్న్ వీడియోలు పంపుతున్నవారిని గుర్తించి ఈ దాడులు నిర్వహిస్తున్నారు.