హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. వంతెన పై నుంచి ఓ కారు కింద పడిన ఘటనలో ఓ మహిళ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మృతి చెందిన మహిళను మణికొండకు చెందిన సత్తెమ్మగా గుర్తించారు. ప్రమాద సమయంలో నిలబడి ఉన్న సత్తెమ్మపై కారు పడడం విషాదం. కారులో గల ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం గచ్చిబౌలి కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన వీడియోలు చూడండి.