తమిళనాడులో నరమాంస భక్షకుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తెన్ కాశి జిల్లాలోని కల్లూరాని గ్రామంలో గల ఓ దేవాలయంలో నిర్వహించిన పండుగ సందర్భంగా మనిషి పుర్రెను మోసుకెళ్లి దాని మాంసాన్ని తిన్నారనే ఆరోపణలపై తమిళనాడు పోలీసులు పది మందిపై కేసు నమోదు చేయడం గమనార్హం. స్థానికంగా ‘సమియాదీలు’గా వ్యవహరించే నరమాంస భక్షకుల ఘటన తీవ్ర సంచలనం కలిగిస్తోంది.

వాస్తవానికి ఈ ఘటనలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్ ఆధారంగా వీఏవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నరమాంస భక్షకులపై కేసు నమోదు చేశారు. అయితే వీళ్లు ఎవరి శరీరాన్ని తీసుకువచ్చి భక్షించారనే అంశాన్ని తెలుసుకునేందుకు శక్తిపోతి సుడలై మదసామి ఆలయం (కట్టు కోవిల్)లో గల కొందరు నరమాంస భక్షకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. సగం కాలిన మానవ మృతదేహాన్ని ఏదైనా గ్రామ శ్మశానవాటిక నుండి తీసుకువచ్చారా? అనే అంశంపై పోలీసులు విచారిస్తున్నారు.

కట్టుకోవిల్ ఆలయానికి చెందినట్లు భావిస్తున్న ‘సమియాదీలు’ పండుగ సందర్భంగా గుర్తు తెలియని ప్రదేశం నుంచి 2019లో కూడా మనిషి పుర్రెను తీసుకువచ్చినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా ఘటన నేపథ్యంలో నిషేధిత ఉత్తర్వులను ధిక్కరించి పండుగ నిర్వహించిన వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసినట్లు వెన్ కాశి జిల్లా ఎస్పీ ఆర్. కృష్ణరాజ్ ఓ మీడియా సంస్థకు చెప్పారు.

Comments are closed.

Exit mobile version