తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ పోలీస్ జవాన్. ఛత్తీస్ గఢ్ లోని నారాయణ్ పూర్ జిల్లా ఓర్చా పోలీస్ క్యాంపులో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఏఎఫ్ భద్రతా బలగాలకు చెందిన అనిల్ యాదవ్ అనే జవాన్ తాను విధులు నిర్వహిస్తున్న పోలీస్ క్యాంపులోనే ఈ చర్యకు పాల్పడి అక్కడికక్కడే మరణించాడు. జవాన్ తనను తాను కాల్పుకోవడానికి గల కారణం ఏమిటో తెలియరాలేదని, విచారణ జరుపుతున్నామని ఏఎస్పీ వైష్ణవ్ చెప్పినట్లు ‘బస్తర్ కీ ఆవాజ్’ వార్తా సంస్థ పేర్కొంది.