షిమ్లాలో కురిసిన భారీ వర్షాలకు ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ పేక మేడలా కూలిపోయింది. అయితే భారీ వర్షాల తీవ్రతను ముందే పరిగణనలోకి తీసుకున్న హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖాచిఘాటి ప్రాంతంలోని ఈ బిల్డింగ్ లో నివాసముంటున్నవారిని ఖాళీ చేయించారు. అయితే పక్కనే గల రెండంతస్తుల బిల్డింగ్ తోపాటు, ఓ హోటల్ కు మాత్రం నష్టం వాటిల్లింది. భారీ వర్షాల ధాటికి ఎనిమిది అంతస్తుల భవనం ఎలా కూలిందో దిగువన గల వీడియోలో చూడవచ్చు.