కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న బాధితులను బ్లాక్ ఫంగస్ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మ్యుకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) అనే వ్యాధి తెలంగాణా రాష్ట్రంలో వెలుగు చూడడం కరోనా వైరస్ బాధితులను కలవరపరుస్తోంది. నిర్మల్ జిల్లా భైంసా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ సోకి మరణించినట్లు తెలుస్తోంది. గాంధీ హాస్పిల్ లో చికిత్స తీసుకుంటున్న మరో ముగ్గురు కరోనా రోగుల్లో కూడా బ్లాక్ ఫంగస్ ను గుర్తించినట్లు సమాచారం. ఇంకొందరు ఇదే తరహా లక్షణాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి సంబంధించి అధికార వర్గాలు పూర్తి స్థాయిలో నిర్ధారించడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న పలువురిలోనూ బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు తాజా సమాచారం.