తెలంగాణా సీఎం కేసీఆర్ మానస పుత్రికగా భావించే ‘నమస్తే తెలంగాణా’ దిన పత్రికను చేత్తో పట్టుకుని మరీ కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ‘నమస్తే తెలంగాణా’ పత్రిక యాజమాన్యానికి సంబంధించి ఎవరి పేర్లు ఉన్నప్పటికీ, తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ అధికార పత్రికగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ‘లాక్ బ్రేక్’ శీర్షికన ఆ పత్రిక ప్రచురించిన వార్తా కథనంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ పత్రిక ప్రచురించిన వార్తా కథనంపై గురువారం మీడియా సమావేశంలో సంజయ్ పలు విమర్శలు చేశారు. ప్రజలకు దిక్సూచిగా ఉండాల్సిన పత్రిక వారిని తప్పుదోవ పట్టించే విధంగా వార్తా కథనం ప్రచురించిందని ఆరోపించారు. ఈ కథనం ఆధారంగా ప్రజలు రోడ్లపైకి వస్తే అందుకు బాధ్యులెవరని ప్రశ్నించారు. నమస్తే తెలంగాణా యాజమాన్యంపై కేసీఆర్ చర్య తీసుకుంటారా? అని నిలదీశారు. టీఆర్ఎస్ అధికార పత్రిక వార్తా కథనంపై సంజయ్ ఇంకా అనేక విమర్శలు చేశారు. మొత్తం అక్షారాల్లోనే చెబితే ఎలా? దిగువన గల వీడియోను చూస్తూ వినండి.