బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామికి చెందిన మీడియా సంస్థల్లోని ఉద్యోగ వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోందా? వివేక్ మీడియా పాలసీకి అనుగుణంగా పనిచేయడం ఇష్టం లేని ఉద్యోగులు కొందరు మిగతా ఉద్యోగులపై సోషల్ మీడియా వేదికగా తెరచాటు యుద్దం చేస్తున్నారా? ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇవే సందేహాలను రేకెత్తిస్తున్నాయి. వివేక్ మీడియా ఉద్యోగ వర్గాల్లో చోటు చేసుకున్నట్లు పలువురు భావిస్తున్న తాజా పరిణామాలు వాస్తవానికి ప్రజాప్రయోజన వార్తాంశం కాకపోవచ్చు. కానీ.., ‘సోషల్ మీడియా’ వేదికగా కొందరు ఉద్యోగులు ఇతరుల చేత సహచర ఉద్యోగులపై పోస్టులు పెట్టిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం సహజంగానే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అందుకే ఇది కూడా వార్తాంశంగానే మారింది. ఇటువంటి పరిణామాల ప్రభావం సహజంగానే వివేక్ మీడియా సంస్థలపై పడుతుందనే అభిప్రాయాలు కూడా ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి.
ఏ పత్రికకుగాని, మరే ఇతర మీడియా సంస్థలకైనా ఓ విధానం ఉంటుందనేది కాదనలేని విషయం. ఆ సంస్థ అధినేత రాజకీయ నాయకుడైతే ఈ విధానం తేటతెల్లంగానే కనిపిస్తుంది. కాంగ్రెస్ నేతగా బహుళ ప్రాచుర్యం పొందిన వివేక్ వెంకటస్వామి టీఆర్ఎస్ లోకి, ఆ తర్వాత కాంగ్రెస్ లోకి మారడం, ప్రస్తుతం బీజేపీలో చేరి ఆ పార్టీ కోర్ కమిటీ సభ్యునిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వివేక్ పార్టీ మారినప్పుడల్లా ఆయనకు చెందిన తొలి మీడియా సంస్థ వీ6 న్యూస్ ఛానల్ అందుకు అనుగుణంగానే వార్తా కథనాలు ప్రసారం చేసింది. ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. సంస్థ అధినేత రాజకీయ అడుగులకు అనుగుణంగా మీడియా సంస్థల నడవడిక కొనసాగడం వర్తమాన జర్నలిజంలో సహజం కూడా. వీ6 ఛానల్ నిలదొక్కుకున్నాక ‘ప్రభాత వెలుగు’ పేరుతో వివేక్ ఓ దినపత్రికను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్ ప్రకారం ఆ పత్రిక టైటిల్ ‘ప్రభాత వెలుగు’ అయినప్పటికీ, ‘వెలుగు’గానే ప్రాచుర్యం పొందింది.
అటు వీ6, ఇటు వెలుగు పత్రికకు చెందిన ఉద్యోగులందరూ ‘వివేక్’ మీడియా గ్రూపునకు చెందినవారే. వివేక్ బీజేపీలోకి మారాక ఈ రెండు సంస్థలు కూడా ఆయన విధానాలనే అనుసరిస్తున్నాయి. కానీ వివేక్ మీడియా సంస్థ ప్రతిష్టను, ఆయన ఎంచుకున్న లక్ష్యాన్ని ‘బద్నాం’ చేసే దిశగా సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో అనేక పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. వివేక్ మీడియాకు చెందిన వెలుగు పత్రికలో పనిచేస్తున్న కొందరు జర్నలిస్టుల పేర్లను ‘నర్మగర్భం’గా ఉటంకిస్తూ సోషల్ మీడియాలో అదే పనిగా పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టులను ‘టార్గెట్’గా చేసుకుని, వారిపై అవినీతి, అక్రమ దందాల ఆరోపణలు చేస్తూ ఈ పోస్టుల పరంపర కొనసాగుతుండడం గమనార్హం. అయితే ఈ పోస్టుల వెనుక వివేక్ మీడియాకే చెందిన కొందరు ఉద్యోగుల హస్తముందనే ప్రచారం జర్నలిస్టు సర్కిళ్లలో సాగుతోంది. వివేక్ రాజకీయ లక్ష్యానికి విరుద్ధంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలతో అంటకాగతున్నట్లు ప్రచారంలో గల ఆయన మీడియాకే చెందిన కొందరు ఉద్యోగులు వెలుగు పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టులను ‘టార్గెట్’గా చేసుకున్నారనేది ప్రచారపు సారాంశం. ఇందుకు కారణాలు అనేకంగా ఉన్నట్లు జర్నలిస్టు వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా వివేక్ మీడియాకు చెందిన కొందరు ఉద్యోగులు గులాబీ పార్టీ ముఖ్య నేతలతో అంటకాగుతున్నారని స్థానిక బీజేపీ నాయకులు కూడా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి అనేక అంశాలను క్రోఢీకరిస్తూ విషయాన్ని బండి సంజయ్ కు నివేదించినట్లు బీజేపీ వర్గాలు బాహాటంగానే పేర్కొంటున్నాయి. మొత్తంగా వివేక్ మీడియాకు చెందిన ఉద్యోగులపై సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం ఖమ్మం జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఈ అంశంలో వివేక్ మీడియా ముఖ్య బాధ్యులు ఎలా స్పందిస్తారు? మొత్తం బాగోతంపై ఏదేని అంతర్గత విచారణ చేస్తున్నారా? వెలుగు పత్రిక ఉద్యోగుల పేర్లను నర్మగర్భంగా ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో అదేపనిగా వస్తున్న పోస్టుల వెనుక ఎవరున్నారు? అందుకు గల బలీయమైన కారణాలేమిటి? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఈ విషయంలో నిజానిజాలను వెలికి తీసి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోకుంటే వివేక్ మీడియా సంస్థల విశ్వసనీయతకు పాఠకుల్లో పెనుప్రమాదంగా బీజేపీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అనేక పోస్టుల్లోని కొన్ని ముఖ్యాంశాలను దిగువన చూడవచ్చు.
పగులుతున్న “వెలుగు”ల బాంబు..
ముడుపులు ఇచ్చిన వారిని బుజ్జగించుకునే పనిలో కో-బ్యాచ్
అంతర్గతంగా సీనియర్ల పేరుతో వున్న కలెక్షన్ కింగ్ లతో చర్చలు
యాడ్ వంక తో కోడ్ చేసిన కింగ్
యాడ్ వద్దు .. ఇచ్చిందే ముద్దు
365 రోజులు యాడ్లున్నాయా ..??
త్వరలో చైర్మన్ వద్దకు బాధితులు
“ప్రశాంతం”గా గీసుకున్న “లక్ష్మణ” రేఖ ను దాటి విషయం బయటికి పొక్కడం పై ఆరా
వెలుగు యొక్క చీకటి బాగోతం
ఫోను సంభాషణ లీక్
కో బ్రదర్ కరప్షన్స్ పీక్స్
ఎంక్వైరీ జరిగితే ఏం చెప్పాలో సీనియర్ నగ్న జర్నలిస్ట్ తో సలహాలు?
డాక్టర్ గారితో బేర సారాలు చేసిన వ్యక్తి త్వరలో లైవ్ లోకి
ప్రశాంతంగా పీడించుకు తింటున్న కో బ్రదర్స్
ఆడియోతో త్వరలో ..
ఆ మైనింగ్ వార్త ధర. రూ.30 వేలు ..
ఆఫీస్ కు వచ్చి త్వరగా దర్శించుకోకపోతే ప్రశాంతంగా ఉండనివ్వనని హుకుం జారీ..!!
పిలిచి ఇచ్చేది బహుమతి ..
అడిగి తీసుకునేది సహకారం / బిచ్చం ..
కాని బెదిరింపులకు పాల్పడి తీసుకునేది లంగగాళ్ల, దొంగపని ..!!
అదొక ప్రాంతీయ వాదాన్ని బలంగా వినిపించిన ఓ టెలివిజన్. ఓ మాజీ ప్రజా ప్రతినిధికి సంబంధించిన సదరు ఛానల్ లో జర్నలిస్టులంతా తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించడమే కాకుండా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ టివి కి అనుసంధానంగా ఓ పత్రికను స్థాపించారు. ఆ పత్రిక కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తుంది. ఆ పత్రికను విజయవంతంగా నడపడం కొరకు యాజమాన్యం అకుంఠిత దీక్షతో పని చేస్తుంది కాని అందులో పని చేసే ఓ జర్నలిస్ట్ నిర్విరామంగా ధనర్జానే ధ్యేయంగా కృషి చేస్తున్నాడు. ఓ అక్రమ మైనింగ్ సంబంధించి రెండు రోజులు వరుస కథనాలు వ్రాసి.. సీరియల్ కథనాలుంటాయని హెచ్చరించి ఆఫీసుకు పిలిపించుకొని అక్షరాల 50 వేలు అడిగి , రూ. 30 వేలకు అంగీకారం కుదుర్చుకున్నాడు. బాకీ ఉన్నట్లే పదే పదే ఫోన్ చేసి తన కార్యాలయానికి రావాలని హుకుం జారీ చేసాడు. వచ్చిన వ్యక్తి పై హుంకార స్వరంతో సమయ పాలన లేదా గద్గద స్వరంతో హెచ్చరించి నేను అప్పుడప్పుడు కాల్ చేస్తా నా చేతి ఖర్చులకు ముట్టజెప్పాల్సి ఉంటదని హెచ్చుమాటలతో పరి సమాప్తం చేసాడు .. ‘కో బ్రదర్ తో జోడెద్దుల జోరు జోరుగానే సాగుతుంది.’ రూరల్ నీది అర్బన్ నాది మధ్యలో మనకు లేదు పోటి..