ఖమ్మం జిల్లా పర్యటనలో గల మంత్రి హరీష్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొనడానికి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ తో కలిసి ఖమ్మం వచ్చిన ఆయనకు బీజేపీ కార్యకర్తల నుంచి నిరసన ఎదురైంది.

ఓ పోలీసు అధికారి మొక్కల మధ్య పడిపోయిన దృశ్యం

జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముగించుకుని జెడ్పీ సమావేశపు హాలుకు వెడుతుండగా మంత్రి హరీష్ ప్రయాణిస్తున్న కారును బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు మంత్రి కారును అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ పోలీసు అధికారి పక్కనే గల మొక్కల మధ్య కింద పడిపోయారు. మంత్రి కాన్వాయ్ ని అడ్డుకుని నిరసనకు దిగిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments are closed.

Exit mobile version