తెలంగాణా రాష్ట్రంలో మరో విప్లవ పార్టీ ఆవిర్భవించింది. సీపీఐ (ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి పార్టీ చీలకలు, పేలికల అనంతర పరిణామాల్లో మిగిలి ఉన్న న్యూ డెమోక్రసీ పార్టీ నుంచే ఈ పార్టీ మరో చీలికగా జనించడం గమనార్హం. సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాయల వర్గం రెండు వర్గాలుగా విడిపోయింది. ఇందులో నుంచే సీపీఐ ఎంఎల్ ‘ప్రజా పంథా’ పేరుతో మరో విప్లవ పార్టీ స్థాపితమైంది.
ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శిగా డీవీ కృష్ణ, సహాయ కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తదితరులు ప్రజాపంథా పార్టీలో ముఖ్యులు కావడం విశేసం. పార్టీ ఏర్పాటుకు సంబంధించి సుదీర్ఘ ప్రకటనను కూడా ప్రజాపంథా నాయకుల విడుదల చేశారు. ఆయా ప్రకటనను దిగువన చదవవచ్చు.