కరోనా మహమ్మారి ఓ మంత్రిని బలి తీసుకుంది. బీజేపీ నాయకుడు, బీహార్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వినోద్ కుమార్ సింగ్ (50) కరోనా బారిన పడి సోమవారం మరణించారు. మంత్రి వినోద్ కుమార్ కు గత జూన్ 28వ తేదీన కరోనా సోకింది. అయితే కరోనా నుంచి ఆయన కోలుకున్నప్పటికీ, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 16న ఆయనను ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. గత రెండు నెలలుగా ఆయన అక్కడే చికిత్స తీసుకుంటూ సోమవారం తుదిశ్వాస విడిచారు.