ఓ టీవీ ఛానల్ వాళ్లు నిర్వహించిన ఒకానొక ‘షో’ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని పొట్టన పెట్టుకుందా? ఔననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు. కరోనా మహమ్మారి పరిణామాల్లో అసలు బాలును ఆ కార్యక్రమానికి పిలవకుండా ఉండి ఉంటే, ఆయన జీవించి ఉండేవారనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. జూలై 30న ఆ టీవీ షో లో బాలు పాల్గొన్నట్లు పేర్కొనగా, ఆగస్టు 5న ఆయనకు కరోనాతో ఆసుపత్రిలో చేరడం గమనార్హం. బాలు మరణంపై ఇది వివాదాన్ని సృష్టించడం కాదు. ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లడాన్ని జీర్ణించుకోలేని బాలు అభిమాని ఒకరు ఆవేదనతో రాసిన పోస్ట్ ఇది. సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఆయా పోస్టును ఉన్నది ఉన్నట్లుగానే దిగువన చదివేయండి.
కరోనా విజృభిస్తున్న కాలంలో…
74 యేళ్ళ వయసున్న
ఒక సీనియర్ సిటిజన్ ని ఒక టీవీ షో కి రమ్మని పిలవడం అసలైన ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది.
వయసు మీద పడిన వారిని అసలు బయటకే రానీయకుండా ఇంట్లోనే ఐసోలేట్ చేసి ఉండింటే బాలుగారికసలు ఈ ఇబ్బందే వచ్చి ఉండేది కాదు.
టీవీ షో నిర్వాహకులకైనా పెద్దాయనని ఇబ్బంది పెట్టకూడదని తెలియకపోయిందే.
కనీసం బాలుగారి బంధు మిత్రులైనా ఈ సమయంలో గాదరింగ్ లు వద్దని వారించలేకపోయారా?
పాటలు పాడినా, గట్టిగా మాట్లాడినా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది.
జులై 30 న ఆయన “సామజవరగమనా”
అనే టీవీ షో అటెండ్ అయ్యారు.
ఆ షోలో అటెండ్ ఐన అందరికీ పాజిటివ్ వచ్చింది బాలుగారితో సహా.
మిగితా వారికి కరోనా తగ్గింది. కానీ బాలూ గారు వయసులో పెద్దవారుకదా.
కనీసం ఆయన వయసుకు గౌరవం ఇవ్వలేని తెలివి మన చదువులదా?. ఆయనని ఈ సమయంలో పిలవవలసినంత అవసరమేమొచ్చింది?
ఆ మొత్తం ప్రోగ్రామ్ జరిగిందే బాలు గారిని ఈ దశలో కోల్పోవడం కోసమనేలా ఉంది.
ఇపుడు ప్రోగ్రామ్ జరగకపోతే ఏం కొంపలు మునిగేవి?
కరోనా వచ్చి ఆరు నెలలు దాటినా దాని బారినుంచి ఎలా రక్షించుకోవాలో ఈ రోజుకీ అవగాహన రాకుంటే …
అసలు చదివేదేమి చదువులు, పనికిమాలిన చదువులు కాకుంటే.
ఈ రోజుకీ కరోనా వైరస్సే లేదనే వాట్సాప్ మేధావులున్నారంటే ఏం చెయ్యాలి ?
ఏదేమైనా బాలు వంటి గాయకుడికి రావలసిన కష్టం కాదిది.
we lost you, sir.Vinod Eleti
???.