పండుగ అంటే అందరికీ సంబరమే. కానీ ఈ సంవత్సరం పరిస్థితులు కరోనా కారణంగా భిన్నంగా ఉన్నాయి. ఈసారి పండుగ ఆనందోత్సాహాలను కుటుంబ సభ్యులతోనే ఇంటిలోనే జరుపుకొనేందుకు పరిమితం అవుదాం.
పైకి మంచిగానే కనిపించినా మన చుట్టూ తిరిగే ఎదుటి వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో గుడ్డిగా అంచనా వేసే పరిస్థితులు లేవు. పండుగ కోసం వివిధ ప్రాంతాల నుండి మనోళ్ళే మనకు తెలిసినవాళ్ళు ఊర్లోకి, మన ఇంటి ప్రక్కకి వచ్చినా, అక్కడ వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఇక్కడికి వచ్చారో తెలియదు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కరోనా మహమ్మారి కాటేసే ప్రమాదం ఉంది జాగ్రత్త.
బతుకమ్మ ఆడే దగ్గర దూరం దూరంగా ఉండి మాస్కు లను తప్పనిసరిగా ధరించాలి . ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంబరంలో ప్రమాదాన్ని గుర్తించకపోతే ఆనందం విషాదంగా మిగులుతుందనే విషయాన్ని గుర్తించండి. అందరం కలిసి జరుపుకునే మరెన్నో పండుగలు భవిష్యత్తులో వస్తాయి. నియమ నిబంధనలు పాటిస్తూ, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటే హాయిగా పండుగ సంబరాలు జరుపుకోవచ్చు.
దిగువన గల సూచనలు పాటించండి- పండుగలను ఆనందంగా జరుపుకోండి.
? తప్పనిసరిగా మాస్క్ లను ధరించండి.
? దూరాన్ని పాటిస్తూ బతుకమ్మ ఆడండి.
? ఇతర ప్రాంతాల నుండి వచ్చిన మనోళ్లు అయినా అలాయ్ బలాయ్ వద్దు.
? చేతులు జోడించి నమస్కరించండి.
? విలువైన ఆభరణాలు ధరించిన ఒంటరిగా వెళ్ళకండి. వెళ్లినా తగు జాగ్రతలు తీసుకోవాలి.
? మీ సెల్ ఫోన్ లలో హాక్ఐ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. అవసరాన్ని బట్టి వినియోగించండి. పోలీసులకు సమాచారం ఇవ్వండి.
? అపరిచితులకు దూరంగా ఉండండి.
? అపరిచిత వ్యక్తులకు మీ వస్తువులు అప్పగించకండి.
? అపరిచితులు ఏవైనా తినుబండారాలు, పిండి వంటలు ఇచ్చినా తీసుకోవద్దు. తినవద్దు.
? కొంతమంది దొంగలు తెలిసినవారిలాగా మాట్లాడుతూ, మనకు ఏదయినా మత్తు పదార్థాలు ఇచ్చి మన ఆభరణాలు, విలువైన వస్తువులు తీసుకెళ్లే ప్రమాదమూ ఉన్నది. అందువల్ల అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
? మీ సెల్ ఫోన్లు, బైకులు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉంది. ఆయా వస్తువులను, వెహికల్స్ ను జాగ్రత్తగా పెట్టుకోవాలి.
సద్దుల బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకున్నది. షి బృందాలకు (SHE teams) చెందిన పోలీసులు సాధారణ దుస్తుల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. అల్లరి మూకల ఆగడాల నియంత్రణ, అలాంటి వారిని ఆధారాలతో పట్టుకునేందుకు కంటికి కనిపించని అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నారు. ఏ ఆపద వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నిమిషాల్లో మీకు సేవలు అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము.
డయల్ 100, షీటీం వాట్సాప్ నెంబర్ 9440795182, కరీంనగర్ టౌన్ ఏసిపి 9440795111, 1town CI 9440795121, 2town CI 9440795107 ఎస్బిఐ 9440795104, సిటీ స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్ 9490619383 నెంబర్లకు సమాచారం అందించండి.
అనుమానితుల కదలికలు, అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచి నగదు పారితోషికాన్ని అందజేస్తాం.
– వి. బి. కమలాసన్ రెడ్డి, ఐపీఎస్
పోలీస్ కమిషనర్, కరీంనగర్