రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైన వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుంది. ఏడు రౌండ్ల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం కూడా ఆధిక్యంలో గల టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గెలుపు ఛాన్సుందా? లేక మూడో స్థానానికి ఆయన పడిపోతారా? రెండో స్థానంలో గల తీన్మార్ మల్లన్న మొదటి స్థానంలోకి వెడతారా? లేక మూడో స్థానానికి వెళ్లక తప్పదా? మూడో స్థానంలో గల టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్ రెండో స్థానంలోకి వెళ్లే ఛాన్సుందా? పల్లాకు పోటీగా నిలిచే పరిస్థితులు ఏర్పడతాయా? లేక తొలి స్థానానికి కూడా వెళ్లే అవకాశముందా? బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఎలిమినేషన్ జరిగితే వారికి సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి బదిలీ అయ్యే అవకాశముంది? ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానంగా ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అత్యంత ఆసక్తికరంగా విశ్లేషణ సాగిన ఈ ఆడియో విన్నాక ఎమ్మెల్సీగా గెలిచేవారి గురించి ఇక అక్షరాల్లో గణాంకాలు కూడా అవసరం లేదు. ఇంతకీ వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ స్థానంలో ఎవరు గెలుస్తారనే అంశంపై వైరల్ గా మారిన ఆడియోను దిగువన మీరూ వినండి.